ఒక ప్రక్క ఫోన్ ట్యాపింగ్ పై విచారణ కొనసాగుతున్నప్పటికి బి ఆర్ ఎస్ పార్టీ నేతలు ఇప్పటికి కాంగ్రెస్ పార్టీ మంత్రుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తున్నారని, వాళ్ళ వద్ద ఇంకా ట్యాపింగ్ పరికరాలు ఉన్నట్లు అనుమానం కలుగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, జరుగుతోందని అనేక మంది గగ్గోలు పెడుతున్నారు.. ఇది అక్షరాలా నిజం. అసలు తాను ఉద్యోగులతో చేసిన సంభాషణకు సంబంధించిన ‘వాయిస్ కాల్ రికార్డ్’ బీఆర్ఎస్ నాయకులకు ఎలా లభ్యమైందని ఆయన ప్రశ్నించారు.

