తిరుమల శ్రీవారి లడ్డూ కేసు విషయంలో మరోసారి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. బాత్రూమ్లు క్లీన్ చేసే కెమికల్స్ ను ఉపయోగించి వైసీపీ హయాంలో లడ్డూను తయారు చేశారని ఆరోపించారు. ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగానే తాను మాట్లాడుతున్నానన్నారు. కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ హయాంలోఐదేళ్లు ఆలయాలన్నింటిలోనూ కల్తీ నెయ్యినే ఉపయోగించి ప్రసాదాలు తయారు చేశారన్నారు. శ్రీశైలంలోనూ కల్తీ జరిగినట్లుగా తేలిందని చెప్పారు.

