తిరుపతి జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాల్వాయిపాడులో జాతీయ రహదారిపై ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తీవ్రటాఫిక్ జామ్ కావడంతో క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు

