బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా( 80) కన్ను మూశారు. ఢాకా లోని ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఖలీదా తుదిశ్వాస విడిచారు. 1945 ఆగస్టు 15న బంగాల్ జల్ పాయి గుడిలో జన్మించారు. బంగ్లాదేశ్ చరిత్రలో మొదటి మహిళా ప్రధానిగా ఉన్నారు. మూడుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1981లో రెహమాన్ హత్య తర్వాత రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1981 నుంచి బంగ్లాదేశ్ నేషలలిస్ట్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. 1982లో సైనిక తిరుగుబాటును అణచివేసి ప్రజాస్వామ్యం నెలకొల్పారు.

