ప్రపంచంతో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఫ్యూచర్ సిటీని అధునాతన నగరంగా తీర్చిదిద్దాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం అంత సులభం కాదని.. అందరం కలిసి పనిచేస్తే ఫ్యూచర్ సిటీ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. నాలుగో నగరంగా భారత్ ఫ్యూచర్ సిటీ రూపుదిద్దుకుంటోందని.. మే నెలలో ఫ్యూచర్ సిటీ కార్యాలయం ప్రారంభిస్తామని చెప్పారు.ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని సిఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

