హైదరాబాద్ శివార్లలో ప్రభాస్ కొత్త సినిమా ‘ఫౌజీ’ చిత్ర బృందానికి చెందిన వాహనం ఘోర ప్రమాదానికి గురైంది. అబ్దుల్లాపూర్‌మెట్ సమీపంలో జరిగిన ఈ దుర్ఘటనలో ప్రొడక్షన్ యూనియన్‌కు చెందిన ఒక వ్యక్తి అక్కడికక్కడే
ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ‘ఫౌజీ’ చిత్ర బృందం ఈ రోజు ఉదయం అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతానికి షూటింగ్ కోసం వెళ్తూ మార్గమధ్యంలో వారి ప్రొడక్షన్ వాహనం నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదానికి గురైంది

