ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ తో పాటు ఇద్దరు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేస్తారని ప్రచారం సాగుతుంది. ఈ పరిణామాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పపందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లకు నోటీసులు జారీ చేయాలని సిట్ నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నానని బండి సంజయ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

