పంచాయతీ ఎన్నికల ఫలితాలతో అధికార పార్టీ కాంగ్రెస్ ఉత్సాహంగా ఉంది.
ప్రస్తుతం రాష్ట్రంలో జీహెచ్ఎంసీతో కలిపి 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఫిబ్రవరితో గడువు ముగియనున్న జీహెచ్ఎంసీతో సహా మిగతా పట్టణ స్థానిక సంస్థలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఇందుకు విద్యార్థుల పరీక్షల సీజన్ మొదలయ్యేలోగా ఎన్నికల నగరా ముగించాలని చూస్తోంది. జనవరి మూడో వారం నాటికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ఎన్నికల కమిషన్కు సూచించినట్లు సమాచారం.

