భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తన ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో శనివారం ఉదయం పార్టీ కీలక నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, శంబిపూర్ రాజు, మాజీ మంత్రి టి. హరీశ్ రావు పాల్గొన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు కాస్త ఆలస్యంగా ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. తెల్లవారుజామునే ఆయన లండన్ నుంచి హైదరాబాద్ వచ్చారు. కవిత చేసిన ఆరోపణలపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది.

