పారిశ్రామిక భూములను చౌకధరకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. భూముల దోపిడీ ఆర్నెల్లుగా జరుగుతుందని, పాలసీ ఇప్పుడు బయటకొచ్చిందని అన్నారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుత్బుల్లాపూర్ లోని షాపూర్లో హమాలీలతో కెటిఆర్ మాట్లాడారు. భూదోపిడీని కార్మిక సంఘాలు అడ్డుకోవాలని సూచించారు. రూ. 5 లక్షల కోట్ల భూదోపిడికి పాల్పడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. రేవంత్ రెడ్డి భూకుంభకోణంలో పారిశ్రామికవేత్తలు భాగం కావొద్దని, తమ ప్రభుత్వం వచ్చాక ఆ భూములు వెనక్కి తీసుకుంటామని పేర్కొన్నారు.

