మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టును ప్రధాని మోదీ బుధవారం సన్మానించారు. వరల్డ్ కప్ విశేషాలను టీమ్ఇండియా క్రీడాకారిణులు మోదీతో పంచుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం లోక్ కల్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో మహిళల ప్రపంచ కప్ విజేత జట్టును ఆతిథ్యం ఇచ్చారు. ప్రధాన మంత్రి మహిళా క్రీడాకారిణులను ‘ఫిట్ ఇండియా’ సందేశాన్ని దేశవ్యాప్తంగా యువతిలోకి తీసుకెళ్లాలని సూచించారు. అలాగే, వారు చదివిన పాఠశాలలకు వెళ్లి విద్యార్థులను ప్రేరేపించాలని సూచించారు.

