పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై మరో ఎమ్మెల్యేకు తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారని నిర్ధారించే సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే గుర్తిస్తున్నట్లు స్పష్టమైన తీర్పును వెలువరించారు. ఇరు పక్షాల వాదనలు, ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం సంజయ్ పార్టీ మారినట్లు నిరూపించే సాక్ష్యాలు లేవని స్పీకర్ తేల్చి చెప్పారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేశారు.

