
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు థియేటర్లలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. క్రిష్-జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, ఏఎం రత్నం నిర్మాణంలో వచ్చిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ జూలై 24న గ్రాండ్ రిలీజ్ అయి అభిమానులను ఆకట్టుకుంది. ఇక థియేటర్ల హంగామా ముగియగానే, సినిమా ఓటీటీ వేదికపైకి అడుగుపెడుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్టు 20 నుంచి హరి హర వీరమల్లు – పార్ట్ 1: స్వోర్డ్ అండ్ స్పిరిట్ స్ట్రీమింగ్ కాబోతోంది.