కేంద్రం ఎప్పుడైతే మహిళా బిల్లు ముసుగులో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా తెచ్చే ప్రయత్నం చేసిందో అప్పుడే దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు కేరళలో ఎల్టీఎఫ్, యూడీఎఫ్ కూటములు, కర్నాటకలో అధికార కాంగ్రెస్, తమిళనాడులో డీఎంకే, మిత్రపక్షాలు, తెలంగాణలో విపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ ఇలా పలు పార్టీలు ఈ బిల్లుల్ని వ్యతిరేకించాయి. అయితే ఏపీలో మాత్రం అధికార టీడీపీ, జనసేన, బీజేపీతో పాటు విపక్ష వైఎస్సార్సీపీ కూడా మద్దతిచ్చింది. ఇప్పుడు బిల్లు వీగిపోవడంతో ఆంధ్రా పార్టీలు పరువు పోగొట్టుకున్నట్లయింది.

