నీట్ యూజీ 2026 పరీక్ష నిర్వహించడంతో పలు పరీక్ష కేంద్రాల వద్ద వింత దృశ్యాలు కనిపించాయి. అమ్మాయిలు ధరించిన నగలు, వాచ్‌లతో పాటు జడలకు వేసుకున్న రబ్బర్ బ్యాండ్లు, క్లిప్‌లను సైతం పరీక్ష నిర్వహకులు తొలగించారు. దీంతో ‘నీట్’ ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థినులు పరీక్ష కేంద్రానికి నీట్‌గా వచ్చినప్పటికీ తనిఖీల సమయంలో చివరకు ఆభరణాలతోపాటు జడల రబ్బర్లు, క్లిప్‌లు కూడా విప్పించారు. దీంతో పలు పరీక్ష కేంద్రాల్లో విద్యార్ధినులు జడలు విప్పుకుని జుట్టు విరబోసుకుని కనిపించారు.

