వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఏపీకి చెందిన అధికారులను హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వస్తుందని అప్పుడు కూటమికి సహకరిస్తున్న అధికారులందరూ పదింతలు మూల్యం చెల్లించక తప్పదని ఘాటుగా వ్యాఖ్యనించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ జైలులు పెడుతుందని, రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతుందని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిస్తుందని, మహిళలపై దౌర్జన్యాలు, హత్యల వల్ల రాష్ట్రం పరువు పోతుందని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నేర నివేదికలో ఏపీకి 31వ ర్యాంకు ఇచ్చిందని వ్యాఖ్యనించారు.

