టీ20 వరల్డ్కప్ గ్రూప్ డీలో భాగంగా చెన్నై వేదికగా అఫ్గానిస్థాన్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. 183 పరుగుల ఛేదనను కివీస్ 17.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది. టిమ్ సైఫర్ట్ (65), గ్లెన్ ఫిలిప్స్ (42) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో రెహ్మన్ 2, అజ్మతుల్లా, రషీద్ ఖాన్, నబీ తలో 1 వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.

