బాపట్ల పట్టణంలోని 5వ వార్డు సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ విధుల్లో ఉన్న డిజిటల్ అసిస్టెంట్ డ్రెస్‌కోడ్ పాటించకుండా, నైట్ ప్యాంటు ధరించి ఆఫీసులో ఉండటం చూసి కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయానికి వచ్చేటప్పుడు పాటించాల్సిన కనీస నిబంధనలను విస్మరించడం సహించేది లేదని స్పష్టం చేస్తూ, సదరు ఉద్యోగిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఆ సచివాలయంలో 11 అర్జీలు గడువు ముగిసినా పెండింగ్‌లో ఉండటంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

