నెల్లూరు మున్సిపల్ కార్పొరేషను మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామాను కలక్టర్ హిమాన్షు శుక్లా ఆమోదించారు. ఇకపోతే ఈనెల 18న మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొత్త మేయర్‌ను ఎన్నుకునే అవకాశం ఉంది.కొత్త మేయర్ ఎంపికయ్యే వరకు ఇన్చార్జి మేయర్‌గా డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

