
నిమ్స్‌లో వైద్య విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోయాడు. అనస్థీషియా వైద్య విద్యార్థి నితిన్ గురువారం రాత్రి నుంచి విధుల్లో ఉన్నాడు. శుక్రవారం ఉదయం ఆపరేషన్ థియేటర్ ఎదురుగా అతడు విగతజీవిగా కనిపించాడు. నిమ్స్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నితిన్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.