ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవడానికి “సార్, ప్లీజ్ నేను మిమ్మల్ని చూడొచ్చా?” అని బతిమాలినట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “తేడా గమనించండి సార్ జీ!” అంటూ మోదీని ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాడు అమెరికా బెదిరింపులకు ఏమాత్రం భయపడని మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎక్కడ? నేడు అమెరికా అధ్యక్షుడి ముందు చేతులు కట్టుకు నిల్చున్న నరేంద్ర మోదీ ఎక్కడ? అంటూ రాహుల్ ఫైర్ అయ్యారు.

