ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ప్రారంభించిన ‘సబ్‌స్క్రిప్షన్’ ఫీచర్‌పై కొందరు నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకుని విమర్శలు చేయడంతో, ఆమె ఈ విషయంపై ఘాటుగా స్పందించారు.తాను సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లో పోస్ట్ చేస్తున్నది కేవలం భక్తికి సంబంధించిన కంటెంట్ అని ఆమె స్పష్టం చేశారు. “నేను నా పర్సనల్ లైఫ్ విశేషాలతో పాటు, నాకు ఇష్టమైన ఆధ్యాత్మిక విషయాలను, దేవాలయాల సందర్శన వీడియోలను అక్కడ పంచుకుంటున్నాను. అందులో ఎలాంటి అశ్లీలత లేదు. కేవలం భక్తి కంటెంట్ మాత్రమే ఉంది” అని ఆమె తెలిపారు.

