మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ బుక్ వివాదాస్పదమైంది. ఇవాళ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. తాను రాసిన పుస్తకం ఆన్‌లైన్‌లో దొరుకుతోందని, లింక్ ఓపెన్ చేస్తే విషయాలు తెలుస్తాయని తన ట్వీట్‌లో నరవణే పేర్కొన్నట్లు రాహుల్ వెల్లడించారు. కానీ తాము ఆ బుక్‌ను ఇంకా రిలీజ్ చేయలేదని పెంగ్విన్ సంస్థ తాజాగా ప్రకటించింది. రాహుల్ గాంధీ మాట్లాడుతూ..నరవణే అబద్దం చెబుతున్నారా లేక పెంగ్విన్ సంస్థ అబద్దం చెబుతుందా అని అడిగారు.

