హైదరాబాద్ మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గూగల్ మ్యాప్ ఆధారంగా హైదరాబాద్‌ను విభజించినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. జంట నగరాల ఉనికి లేకుండా కుట్ర చేస్తున్నారని తలసాని ఆరోపించారు. సికింద్రాబాద్ చరిత్రను, సంస్కృతిని నాశనం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ధైర్యం ఉంటే హైదరాబాద్ పేరు మార్చి చూడమని సీఎం రేవంత్ రెడ్డికి సవాలు విసిరారు.

