మహారాష్ట్రలోని తుల్జా భవాని అమ్మవారి దర్శనం నిమిత్తం వెళ్లి తిరిగి వస్తుండగా టాటా ఏసీ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ పరిధిలోని ముంబై 65వ జాతీయ రహదారిపై ఓవర్ లోడ్‌తో ఉన్న ట్రక్కు వెనక్కి వస్తూ.. టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. వెనుక వస్తున్న కారు సైతం టాటా ఏస్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది

