ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైసిపి కార్యకర్త మందా సాల్మన్ పై తెలుగుదేశం కార్యకర్తలు ఇనుపరాడ్డుతో దాడి చేయడంతో మృతి చెందాడు. తాము దళితులమే, సామాన్యులమే అంతా మాత్రాన తన తండ్రి ప్రాణాలకు విలువ లేదా? అని ప్రశ్నించారు. తండ్రిని కోల్పోయి తామంతా బాధలో ఉంటే స్థానిక టిడిపి నాయకుడు అవహేళన చేసి మాట్లాడడం చాలా బాధాకరంగా ఉందని మృతుడి కుమారులు ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా తన తండ్రిని చంపిన వారిని శిక్షించాలని కూటమి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్నారు.

