దక్షిణాఫ్రికాలోని న్యూ అహోబిలం దేవాలయం కూలడంతో నలుగురు మృతి చెందారు. మృతుల్లో ో టెంపుల్ ట్రస్టు ఎగ్జిక్యూటివ్ సభ్యుడు, నిర్మాణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న విక్కీ జయరాజ్ పాండే ఉన్నారు. క్వాజూలు-నటాల్ ప్రాంతంలో శుక్రవారం ఈ ప్రమాదం సంభవించింది. నాలుగు అంతస్తుల మేర ఉన్న దేవాలయంలో విస్తరణ పనులు జరుగుతున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. శిథిలాల కింద చిక్కుకుని పలువురు మరణించారు. మృతుల్లో ఇద్దరు కార్మికులు, దేవాలయానికి వచ్చిన ఓ భక్తుడు ఉన్నట్టు సహాయక బృందాలు తెలిపాయి

