దక్షిణ కొరియాలోని డేజియోన్ నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఒక కారు విడిభాగాల తయారీ కర్మాగారంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఊహించని విధంగా సంభవించిన భారీ పేలుడుతో ఫ్యాక్టరీ ఒక్కసారిగా అగ్నిగుండంగా మారింది. ఈ ప్రమాదం వల్ల భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. కర్మాగారంలో పని జరుగుతున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించడంతో కార్మికులు తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 59 మంది తీవ్రంగా గాయపడ్డారు.

