టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) మార్చి 2026లో నిర్వహించిన స్వతంత్ర డ్రైవ్ టెస్ట్‌లో వరంగల్ నగరంలో జియో 5జీ సేవలు అగ్రస్థానంలో నిలిచాయి. డేటా వేగం, వాయిస్ నాణ్యత, లేటెన్సీ, సిగ్నల్ బలం అన్ని విభాగాల్లో జియో ఇతర సంస్థలకంటే ముందంజలో ఉందని నివేదిక తెలిపింది. ముఖ్య ప్రాంతాల్లో అత్యధిక డౌన్లోడ్ వేగం నమోదు కాగా కాల్ కనెక్టివిటీ కూడా స్థిరంగా ఉన్నట్టు వెల్లడైంది. ట్రాయ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం జియో నెట్వర్క్ సగటు డౌన్లోడ్ వేగం 260.01 Mbpsగా నమోదైంది.

