తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా (DGP) సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. డీజీపీ కార్యాలయానికి చేరుకున్న సీవీ ఆనంద్కు పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య, పండితుల ఆశీర్వచనాలతో ఆయన తన కుర్చీలో ఆసీనులయ్యారు. బాధ్యతలు స్వీకరించే ముందు పోలీసు విభాగం నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు.

