
తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ ఇటీవల ఓ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టీజీఎస్ ఆర్టీసీ మొత్తం 1743 పోస్టులను భర్తీ చేయనుంది. 10వ తరగతి లేదా ఐటీఐ అర్హత కలిగిన అభ్యర్థులు డ్రైవర్, శ్రామిక్ (Mechanic Helper) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని, ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2025 అక్టోబర్ 8న ప్రారంభం కాగా, అక్టోబర్ 28తో తుది గడువు ముగియనుంది. డ్రైవర్ పోస్టులు: 1000,శ్రామిక్ పోస్టులు: 743