పశ్చిమ బెంగాల్లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ మౌసమ్ నూర్ గుడ్ బై చెప్పారు. శనివారం కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు జైరామ్ రమేష్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్, పీసీసీ అధ్యక్షుడు శుభంకర్ సర్కార్ సమక్షంలో మౌసమ్ నూర్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

