సినీ నటి త్రిష కృష్ణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. అంతకముందు వైకుంఠ క్యూ కాంప్లెక్సు ద్వారా త్రిష ఆలయంలోకి వెళ్లారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. నేడు తన పుట్టినరోజు సందర్భంగా త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నటి త్రిషను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చారు.

