ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమలలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో సమీక్ష చేశారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలను అత్యంత ఆధునాతన ఆధ్యాత్మిక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి, వనరులను సమర్థవంతంగా వినియోగించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు.

