తిరుమలలో భద్రతా లోపాల పై కేంద్రం ఆరా తీసింది. కొంత కాలంగా చోటు చేసుకుం టున్న వరుస పరిణామాల పైన స్పందించాలని సూచించింది. తిరుమలలో భద్రతా వైఫల్యాల పైన తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్రానికి ఫిర్యాదు చేసారు. తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. రెడ్ బుక్ రాజ్యాంగంపై దృష్టి సారించిన ప్రభుత్వం పాలనపై పట్టు కోల్పోయిందని పేర్కొన్నారు.తిరుమలలో భద్రతా లోపాలు భక్తుల జీవితాలను ప్రమాదంలో పడేయడంతో పాటు, వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పవిత్రతను తీవ్రంగా దెబ్బతీశాయని తెలిపారు.

