ప్రముఖ కార్ల తయారీ సంస్థ అయిన టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) లిమిటెడ్ తమిళనాడులో కొత్త తయారీ కేందాన్ని ప్రారంభించారు. రాణిపేట జిల్లాలోని పాణపక్కంలో ఏర్పాటుచేసిన ఈ ప్లాంట్ను సోమవారం తెరిచారు. కార్యక్రమంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ పాల్గొన్నారు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్తోపాటు, దాని అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) కు చెందిన కార్లనూ ఇక్కడే తయారుచేస్తారు.

