ఎం.ఎల్.స్టాలిన్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం నుండి తమిళనాడు మంత్రులు వి.సెంథిల్ బాలాజీ, కె. పొన్ముడి రాజీనామా చేశారని, గవర్నర్ దానిని ఆమోదించారని రాజ్‌భవన్ ఆదివారం తెలిపింది. సెంథిల్ బాలాజీ ఈడి దర్యాప్తును ఎదుర్కొంటున్నారు,‘పదవా లేక స్వేచ్ఛా ఏదో ఒకటి ఎంచుకొండి’ అంటూ సుప్రీంకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఒకవేళ మంత్రి పదవి నుంచి దిగిపోకపోతే బెయిల్‌ను కూడా రద్దు చేస్తామని హెచ్చరించింది. ఒక సెక్స్ వర్కర్ విషయంలో పొన్ముడి చేసిన శైవ వైష్ణవ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది.

