త్వరలో తమిళనాడు, బంగాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని తమిళనాడులోని పుదుక్కోట్టైలో జరిగిన బీజేపీ ర్యాలీలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార డీఎంకే ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ‘అవినీతి మంత్రుల సైన్యంతో రాష్ట్రం పురోగమించగలదా?’ అని అమిత్ షా ప్రశ్నించారు. డీఎంకే వంశపారంపర్య పాలనను శాశ్వతంగా కొనసాగించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, కానీ ఆ కల నెరవేరదని పేర్కొన్నారు.

