భారతీయ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఊరటనిచ్చే కీలక ప్రకటన చేసింది. టైప్-2 డయాబెటిస్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సెమాగ్లుటైడ్ ఇంజెక్షన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.ఇప్పటివరకు సెమాగ్లుటైడ్ ఔషధంపై విదేశీ కంపెనీలకు పేటెంట్ హక్కులు ఉండటంతో, దీని ధర సామాన్య రోగులకు భారంగా ఉండేది. విదేశీ బ్రాండ్ల కంటే గణనీయమైన తక్కువ ధరకే ఇది లభించనుంది. ప్రతిరోజూ మందులు వాడే ఇబ్బంది లేకుండా, దీనిని వారానికి ఒకసారి మాత్రమే తీసుకునేలా రూపొందించారు.

