భారతదేశ పొరుగు దేశాన్ని భారీ భూకంపం వణికించింది. మయన్మార్‌ను 7.7 తీవ్రతతో భూకంపం కుదిపేసింది. ఢాకా, చిట్టగాంగ్‌తో సహా బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి. అయితే, ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని బంగ్లాదేశ్ వాతావరణ శాఖ తెలిపింది. దీని కేంద్రం మయన్మార్‌లోని మండలే, బంగ్లాదేశ్ సరిహద్దుకు సమీపంలో ఉంది. దీని కేంద్రం మయన్మార్‌లోని సాగింగ్‌కు వాయువ్యంగా 16 కిలోమీటర్ల దూరంలో, 10 కిలోమీటర్ల లోతులో నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించింది.

