హైదరాబాద్‌లోని అటామిక్ ఎనర్జి విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL).. ఒప్పంద ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 22, 2025వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ప్రకటన కింద మొత్తం 160 టెక్నికల్ ఆఫీసర్-సి పోస్టులను భర్తీ చేయనున్నారు. 60 శాతం మార్కులతో సంబంధిత విభాగాల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

