డంకీ మార్గంలో తమ దేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలతో 54 మంది భారతీయులను అమెరికా తాజాగా వెనక్కిపంపింది. అందులో అత్యధికంగా హర్యాణా వాసులే కావడం గమనార్హం. అంబాలా (5), యమునా నగర్ (4), కురుక్షేత్ర (4), జింద్ (3), సోనిపట్ (2), పంచకుల, పానిపట్, రోహ్తక్, ఫతేహాబాద్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. వారంతా ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు.

