రాజస్థాన్ జోధ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫలోడిలోని మటోడా ప్రాంతంలో ఆదివారం (నవంబర్ 2)న ఆగివున్న ట్రక్కును ట్రావెలర్ టెంపో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మరణించగా, అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు.
వీరంతా బికనీర్‌లోని కొలాయత్ ఆలయ దర్శనానికి వెళ్లారు. దైవ దర్శనానంతరం తిరిగి ఇంటికి వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ఢీకొన్న వెంటనే వాహనం నుంచి దట్టమైన మంటలు ఎగిసిపడ్డాయి.

