అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలంలోని గండబోయినపల్లె టోల్ గేట్ దగ్గర టోల్దేట్ సిబ్బంది కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కారును ఆపారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహానికి గురయ్యారు. కారు దిగి అధికార పార్టీ ఎమ్మెల్యే కారునే ఆపుతారా అంటూ అనుచరులతో కలిసి టోల్ సిబ్బందిపై దాడి చేశారు. మహిళలపై కూడా దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే అనుచరులు టోల్ గేట్ మేనేజర్ రవిని కొట్టి కారులో ఎత్తుకెళ్లారు. ఎమ్మెల్యే, అనుచరుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

