ఇన్ సర్వీసు టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉపాధ్యాయులు ధర్నా చేపట్టారు. ఇన్ సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా టెట్ పై కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యా హక్కు చట్టం 2010 లోని సెక్షన్ 23 సవరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందని, కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

