ఒంటిమిట్టను టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇక్కడికి వచ్చే భక్తులు రెండు మూడు రోజులు ఉండేలా సకల సదుపాయాలు కల్పిస్తామన్నారు. కడప జిల్లా, ఒంటిమిట్టలో జరిగిన శ్రీసీతారాముల కళ్యాణోత్సవంలో సీఎం చంద్రబాబు దంపతులు పాల్గొని స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ ఆధ్వర్యంలో కనీవిని ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. కన్నుల పండువగా ఒంటిమిట్ట సీతారాముల వారి కళ్యాణానికి భక్తులు తరలివచ్చారు. అంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా కళ్యాణోత్సవం జరిగింది.

