ఓ 12 ఏళ్ల బాల నటి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డు విజేతలను ఎంపిక చేసిన జ్యూరీ సభ్యుడిగా ఉన్న ప్రకాష్ రాజ్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది… ‘పిల్లల విషయంలో మీ కళ్లు మూసుకుపోయాయి. కానీ అంతా చీకటిగా ఉందని మాత్రం చెప్పకండి. ఈ సోసైటీలో పిల్లలు కూడా భాగమే.. 2024 మలయాళం ఫిల్మ్ అవార్డుల విషయంలో భవిష్యత్ తరాలకు చెందిన పిల్లల విషయంలో జ్యూరీ, పూర్తిగా కళ్లు మూసుకుపోయినట్టుగా వ్యవహరించింది..’ అంటూ రాసుకొచ్చింది దేవనంద జిబిన్..

