
ఎట్టకేలకు జేఎన్టీయూ(JNTU)లో పీహెచ్డీ ప్రవేశాలకు మోక్షం లభించింది. సెప్టెంబరులో నిర్వహించిన ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు నెలరోజులుగా అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అర్హులైన అభ్యర్థుల ఒరిజినల్ ధ్రువపత్రాల పరిశీలనకు తాజాగా అడ్మిషన్ల విభాగం అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఈ నెల 24నుంచి 26వరకు మూడురోజుల పాటు వివిధ ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలకు సంబంధించిన అభ్యర్థులు వారికి నిర్ధేశించిన రోజుల్లో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని షెడ్యూల్లో పేర్కొన్నారు.