దేశంలో స్థూల వస్తు, సేవల పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.ఏప్రిల్ నెలకు గానూ 8.7 శాతం వృద్ధితో రూ.2.43 లక్షల కోట్ల మేర వసూళ్లు అయ్యాయి. దేశీయంగా విక్రయాలు పెరగడం, దిగుమతుల కారణంగా పన్ను వసూళ్లు ఈ స్థాయిలో పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తోంది. 2025 ఏప్రిల్లో రూ.2.37 లక్షల కోట్లు వసూలయ్యాయి. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల కావడమూ ఈ వసూళ్లకు ఓ కారణంగా కనిపిస్తోంది.

