లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తుతం జర్మనీలో పర్యటిస్తున్నారు. బెర్లిన్‌లోని హెర్టీ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. భారతీయ ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.
ఓటరు జాబితా అంశంలో తీవ్ర సమస్యలు ఉన్నాయని, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పాలిటిక్స్ ఈజ్ ద ఆర్ట్ ఆఫ్ లిజనింగ్ అన్న టాపిక్‌పై రాహుల్ గాంధీ ప్రసంగించారు. 2024లో హర్యానా, మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగినట్లు ఆందోళన వ్యక్తం చేశారు.

